మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రామారావు
ఎమ్మెల్సీ రామారావు
ప్రజాశక్తి- ఇచ్ఛాపురం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రకటించిన వరలను ప్రజలు ఎవ్వరు నమ్మరని, అబద్దాల సిఎంగా జనాల్లో పేరు ఉందని ఎమ్మెల్సీ నర్తూ రామారావు విమర్శించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. గతంలో అనేక హామీలు ఇచ్చి అమలు చేయని చంద్రబాబు పనితీరు అందరకీ తెలుసు అని వ్యాఖ్యానించారు. ఉచిత గ్యాస్ సిలెండర్, అందరకీ అందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. తొమ్మిది సార్లు గెలిపించారని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఈ తొమ్మిదేళ్లు ఇచ్ఛాపురం నియోజకవర్గానికి ఏమి చేశారని ప్రశ్నించారు. సాగునీరు సమస్యలు పరిష్కరించకుండా రైతులకు మొండి చెయ్యి చూపారని ఆరోపించారు. గతంలో ప్రకటించిన కొబ్బరి పార్కుకు దిక్కులేదన్నారు. మళ్లీ ప్రజలను మోసం చేయడానికి హామీనిచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపిపి బోర పుష్ప, జెడ్‌పిటిసి ఉప్పాడ నారాయణమ్మ, మోహనరావు, పిట్ట మామయ్య, చిట్టిబాబు, కారింగ త్రినాత్, నూకయ్య రెడ్డి, సుగ్గు ప్రేమ్‌కుమార్, సంతోష్ పాల్గొన్నారు.