ఎపిఆర్‌డిసిలో మహేష్‌కు 48వ ర్యాంకు

సరుబుజ్జిలి ప్రభుత్వ

మహేష్‌

ప్రజాశక్తి – సరుబుజ్జిలి

సరుబుజ్జిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అకౌంటింగ్‌ అండ్‌ టేక్సేషన్‌ విద్యార్థి కూరాకుల మహేష్‌ ఎపిఆర్‌డిసి ఫలితాల్లో సత్తా చాటాడు. ఎపి రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల ప్రవేశ పరీక్షలో 48వ ర్యాంకు సాధించాడు. ఇంటర్మీడియట్‌ పాసైన విద్యార్థులకు డిగ్రీలో ఉచితంగా రెసిడెన్షియల్‌ విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎపిఆర్‌డిసి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష కోసం వేల సంఖ్యలో విద్యార్థులు పోటీపడుతుంటారు. బూర్జ మండలం అన్నంపేటకు చెందిన కూరాకుల సూర్యనారాయణ కుమారుడు మహేష్‌ సరుబుజ్జిలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. గతేడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 469 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచాడు. అదే ఏడాది మాస్టర్‌ మైండ్స్‌ సంస్థ నుంచి నగదు పురస్కారం కూడా పొందాడు. ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ దుగ్గివలస రాంప్రసాద్‌, కామర్స్‌ అధ్యాపకులు బి.సంగీత సహకారంతో తాను ఈ ర్యాంకు సాధించగలిగానని మహేష్‌ తెలిపాడు. మహేష్‌ను కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

➡️