పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు

పోలింగ్‌ కేంద్రాల

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ వెంకటేశ్వరరావు

  • డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లాలోని పలు రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి, ఎలక్ట్రోరల్‌ అధికారి స్థాయిలో ప్రతి నెలా నిర్వహించాల్సిన గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలతో కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. బూత్‌స్థాయి అధికారుల నియామకాలు, పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి అంశాలపై చర్చించి పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు తదితర వాటిపై సమీక్షించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు చేసిన సూచనలు, సలహాలను స్వీకరించారు. సమావేశంలో టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, బిజెపి జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, వైసిపి నాయకులు ఆర్‌.శంకరరావు, కాంగ్రెస్‌ నాయకులు కె.ఎల్‌.ఎస్‌ కుమారి, బిఎస్‌పి నాయకులు ఎల్‌.సోమేశ్వరరావు, సిపిఎం నాయకులు ఎం.గోవర్థనరావు తదితరులు పాల్గొన్నారు.

➡️