మార్చి 7 నుంచి జాతీయ టెక్నో ఫెస్ట్‌

జాతీయ టెక్నో మేనేజ్‌మెంట్‌

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఆర్‌జికెయుటి అధికారులు

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

జాతీయ టెక్నో మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌ (టెక్నివర్స్‌ 2స25)ను మార్చి 7 నుంచి 9వ తేదీ వరకు ట్రిపుల్‌ ఐటిలో నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ కె.వి.జి.డి బాలాజీ తెలిపారు. ఫెస్ట్‌ పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టెక్నివర్స్‌లో పలు ఐఐటిల ప్రొఫెసర్లు ఎఐ, సెన్సార్‌, హైడ్రాలజీ, మెకానికల్‌ బిహేవియర్‌ ఆఫ్‌ హై టెంపరేచర్‌ అల్లార్సు, విఎల్‌ఎస్‌ఐ, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌పై ప్రసంగిస్తారని తెలిపారు. డిపార్ట్‌మెంటల్‌ వర్క్‌షాప్స్‌, టెక్నికల్‌ క్విజ్‌, రోబోటిక్స్‌, టెక్నికల్‌ పేపర్‌ ప్రజెంటేషన్‌ ఇలా 30 పైబడి ఈవెంట్స్‌ ఉన్నాయని వివరించారు. ఈ టెక్నివర్స్‌కు కన్వీనర్‌గా గేదెల రవి, డీన్‌ స్టూడెంట్‌ వెల్ఫేర్‌ సిహెచ్‌.తేజ కిరణ్‌ సివిల్‌ హెచ్‌ఒడి కో కన్వీనర్‌గా ఉన్నారు. కార్యక్రమానికి అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి ముని రామకృష్ణ, డీన్‌ అకడమిక్స్‌ కొర్ల మోహనకృష్ణ చౌదరి, ఫైనాన్స్‌ అధికారి సిహెచ్‌.వాసు, అకౌంట్స్‌ అధికారి కె.మోహనరావు, డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఒడిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️