త్వరితగతిన నూతన కలెక్టరేట్‌ పనులు

కలెక్టరేట్‌లో నిర్మాణంలో ఉన్న సమీకృత

పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

కలెక్టరేట్‌లో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. భవన సముదాయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి రహదారులు, భవనాలశాఖ ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టరుతో కలిసి శనివారం పరిశీలించారు. నూతన కలెక్టరెట్‌ ఆవరణలో పార్కింగ్‌, సెక్యూరిటీ, ప్రహరీ నిర్మాణం తదితర పనులపై ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ జాన్‌ సుధాకర్‌ను ఆయన ప్రశ్నించారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు రాజీలేదని, నిర్థేశించిన మేరకు పనులు పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటికే భవనంలో కొన్ని విభాగాలకు కేటాయించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్‌ఇ వివరించారు. పూర్తి స్థాయిలో పనులను వివరించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి అంతస్థులో ప్రతి గదిని పరిశీలించారు. మ్యాప్‌లో నిర్థేశించిన మేరకు నిర్మించాలన్నారు. భవనానికి ముందు భాగంగా చుట్టూ రోడ్లు నిర్మించాలన్నారు. అలాగే విశాలమైన ప్రాంగణం రూపుదిద్దుకోవాలన్నారు. ఈపరిశీలనలో డిఆర్‌ఒ వెంకటేశ్వరరావు, ఎఒ సూర్యనారాయణ, కాంట్రాక్టరు తరపున సైట్‌ ఇన్‌ఛార్జి ప్రసాదరావు పాల్గొన్నారు. వడ్డె ఓబన్నకు నివాళిబ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వడ్డె ఓబన్న అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కొనియాడారు. శనివారం ఓబన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, బిసి సంక్షేమాధికారి బి.అనురాధ, కలెక్టరెేట్‌ ఎఒ సూర్యనారాయణ, జిల్లా బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుత్తు చిన్నారావు పాల్గొన్నారు.

 

➡️