యూనిఫారం పంపిణీలో అలసత్వం వద్దు

విద్యార్థులకు ప్రభుత్వం

యూనిఫారాలను పరిశీలిస్తున్న వెంకటేశ్వరరావు

  • డిఇఒ కె.వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – పలాస

విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫారాల పంపిణీలో అలసత్వం వహించద్దని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు అన్నారు. మండల రీసోర్స్‌ కేంద్రంలో యూనిఫారాలను మంగళవారం పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని పాఠశాలలకు యూనిఫారాలు పంపిణీ చేశారు, ఇంకా ఎన్ని పాఠశాలలకు పంపిణీ చేయాలి, రికార్డులో ఉన్న యూనిఫారాలు, గోదాములో ఉన్న దుస్తులు సరిపోయా లేదా పరిశీలించారు. యూనిఫారాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరిస్తానన్నారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారులు సిహెచ్‌.శ్రీనివాసరావు, చెరుకుపల్లి సత్యం, పోతనపల్లి బాలరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.

➡️