కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ

నామినేషన్‌ దాఖలు చేస్తున్న చక్రవర్తిరెడ్డి

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాసుపత్రి చక్రవర్తిరెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పట్టణ పుర వీధుల్లో కాంగ్రెస్‌ కార్యకర్తల ర్యాలీతో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుదర్శనదొరకు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆనేక సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే తనను ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆలీం ఖాన్‌ పాపారావు. వాసు పాల్గొన్నారు.

 

➡️