గడ్కరీతో చర్చిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
కంద్ర మంత్రి గడ్కరీని కోరిన రామ్మోహన్‌నాయుడు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన్ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా మీదుగా విస్తరించి ఉన్న 16వ నంబరు జాతీయ రహదారిని నరసన్నపేట – ఇచ్ఛాపురం మధ్య ఆరు లైన్లకు విస్తరించాలన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నం మధ్య రహదారికి అనుబంధంగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని కోరారు. దీనివల్ల విశాఖ ఎయిర్‌పోర్టుకు సైతం సులభంగా చేరుకోవచ్చని తెలిపారు. కళింగపట్నం – శ్రీకాకుళం – పార్వతీపురం మధ్య ఉన్న సిఎస్‌పి రోడ్డును జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒడిశాలోని రాయఘడ, ఛత్తీస్‌గఢ్ రాజధాని రారుపూర్‌తో జిల్లా రహదారులను అనుసంధానం చేయాలన్నారు. అలికాం – బత్తిలి రోడ్డు, డోల – పోలాకి – నౌపడ రోడ్డును విస్తరించడం ద్వారా నరసన్నపేట – నౌపడ – మూలపేట పోర్టు – మెళియాపుట్టి) మార్గంలో కీలక పురోగతి సాధించవచ్చని వివరించారు. దీని ద్వారా లక్ష మందికి పైగా ప్రజలు, రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు.