తీర ప్రాంతాల్లో గస్తీ పెంపు

తీర ప్రాంతాల్లో

మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న డిఐజి గోపీనాథ్‌ జట్టి

  • విశాఖ రేంజ్‌ డిఐజి గోపీనాథ్‌ జట్టి

ప్రజాశక్తి – గార

తీర ప్రాంతాల్లో గస్తీని పెంచాలని విశాఖ రేంజ్‌ డిఐజి గోపీనాథ్‌ జట్టి మెరైన్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. మండలంలోని కళింగపట్నం తీరంలో గల మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. తీర ప్రాంత భద్రత దృష్ట్యా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ముందస్తు సమాచార సేకరణ తప్పనిసరి అని అన్నారు. సముద్రతీర ప్రాంతంలో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలన్నారు. సిబ్బంది, వివరాలు, పనితీరుపై ఆరా తీసి ప్రతిఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు.

➡️