పింఛను పాట్లు

శ్రీకాకుళం జిల్లాకు

పొందూరు మండలం రాపాక సచివాలంయం వద్ద వేచి ఉన్న పింఛనుదారులు

  • సచివాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షణ
  • పంపిణీపై సమాచారం లేక అవస్థలు పడ్డ లబ్ధిదారులు
  • జమ కాని డబ్బులు
  • కనిపించని సౌకర్యాలు
  • 29 శాతమే పంపిణీ

 పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు అవస్థ లు తప్పలేదు. ఎన్నికల నేపథ్యంలో సచివాల యాల్లో పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో అధికారులు బుధవారం నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. ఫించన్ల పంపిణీకి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు పడ్డారు. పింఛన్ల సొమ్ము కోసం బ్యాంకులకు వెళ్లిన సచివాలయ సిబ్బంది ఆలస్యంగా రావడంతో గంటల తరబడి నిరీక్షించారు. పింఛన్ల పంపిణీ ప్రాంతాల్లో టెంట్లు, నీటి వసతి సౌకర్యాలు లేకపోవడంతో చాలా అసౌకర్యానికి గురయ్యారు.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, యంత్రాంగం

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ నెల అన్ని రకాల పింఛన్లు కలిపి మొత్తం 3,21,662 మందికి సంబంధించి సొమ్ము విడుదల చేశారు. బుధవారం నాటికి 93,669 మందికి (29.12శాతం) అందించారు. ఇంకా 2,28,020 మందికి పింఛను డబ్బులను అందించాల్సి ఉంది. ఆమదాలవలస పురపాలక సంఘ పరిధిలో 11 సచివాలయాలు ఉండగా, వాటి పరిధిలో 4936 మంది లబ్ధిదారులు ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మోణింగి వారి వీధి -1, మెట్టక్కివలస-2, గేటు, చింతాడ సచివాలయాలకు మాత్రమే డబ్బులు మంజూరయ్యాయి. మిగిలిన ఏడు సచివాలయాలకు డబ్బులు అకౌంట్లలో జమ కాకపోవడంతో చాలామంది లబ్ధిదారులు పింఛను కోసం సచివాలయాల వద్ద ఎదురు చూపులు చూసి నిరాశతో ఇంటికి వెనుతిరిగారు. కొంతమంది పింఛనుదారులు ఎండతో ఇంటికి వెళ్లలేక సచివాలయంలోనే సాయంత్రం వరకు వేచి ఉన్నారు. ఎండ తీవ్రత తగ్గిన తర్వాత ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. లక్ష్ముడుపేట సచివాలయం పరిధిలో తిమ్మాపురం, వెంకయ్యపేట వార్డు పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వారు ఈ సచివాలయానికి చేరుకోవాలంటే తిమ్మాపురం నుంచి రెండు కిలోమీటర్లు, వెంకయ్యపేట నుంచి కిలోమీటరు ప్రయాణం చేసి చేరుకోవాలి. పింఛన్ల కోసం లబ్ధిదారుల ఉదయం 10 గంటలకే సచివాలయానికి వచ్చారు. పింఛన్లు ఇవ్వడం లేదని తెలిసినా ఎండకు భయపడి సాయంత్రం వరకు సచివాలయం వద్దే వేచి చూసి నాలుగు గంటల సమయంలో ఇళ్లకు వెళ్లిపోయారు. సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలుపొందూరులో మండలం రాపాక సచివాలయంలో బుధవారం నుంచి పింఛన్లు అందిస్తామని సమాచారమివ్వడంతో ఉదయం 9 గంటల నుంచే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు చేరుకున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఉక్కబోతతో అక్కడే ఉన్న చెట్లు కిందన, చిన్నపాటి నీడల్లో నిల్చొని వేచి చూశారు. భోజన సమయం అయినా అందకపోవడంతో ఇంటికి వెళ్లి, మరలా వచ్చి సాయంత్రం వరకూ ఉన్నారు. అయినా డబ్బులు రాలేదని సచివాలయం సిబ్బంది చెప్పడంతో ఊసూరుమంటూ ఇంటిబాట పట్టారు. పొందూరు మండలంలో ఉన్న 27 సచివాలయాలు ఉండగా, ఎనిమిది సచివాలయాలకు సంబంధించి మాత్రమే డబ్బులు వచ్చాయి పింఛను కోసం ఉదయం నుంచి సచివాలయం వద్ద ఉన్నాం. కవిటిలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు బ్యాంకుల్లో పింఛను సొమ్ము జమకాకపోవడంతో లబ్ధిదారులకు పింఛను పాట్లు తప్పలేదు. దీంతో అటు సచివాలయ సిబ్బంది, ఇటు లబ్ధిదారులకు నిరీక్షణ తప్పలేదు. మూడో తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రతీ సచివాలయం వద్ద పింఛన్లు పంపిణీ చేస్తారనే సమాచారంతో ఉదయం నుంచే సచివాలయాలకు చేరుకున్నారు. బ్యాంకులకు వెళ్లిన సచివాలయ సిబ్బంది ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కాలేదని సమాచారం చెప్పడంతో చాలామంది వెనుదిగారు. చివరకు రెండు గంటల తరువాత పింఛను డబ్బులు రావడంతో సచివాలయాల వద్ద పంపిణీ ప్రారంభమైంది.అరకొరగానే పింఛన్ల పంపిణీపలాసలో ఉదయం 9 గంటల నుంచి పించన్లు పంపిణీ చేస్తామని చెప్పి వాయిదా వేశారు. నగదు కోసం బ్యాంకులకు వెళ్లిన సచివాలయ సిబ్బంది తిరిగి రావడంలో జాప్యం జరగడంతో మున్సిపాలిటీ పరిధిలో మధ్యాహ్నం 12 గంటలకు, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు గంటలకు పంపిణీ ప్రారంభించారు. పింఛన్లు పంపిణీ చేసే ప్రాంతాల్లో పలుచోట్ల టెంట్లు, సచివాలయాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం నుంచి పింఛన్లు సొమ్ము బ్యాంకులో జమకాకపోవడం బుధవారం అరకొరగానే పంపిణీ చేశారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో కొంత సొమ్ము జమకావడంతో మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాల్లో డబ్బులు అందించారు. పింఛన్ల అందజేతపై లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకపోవడంతో బుధవారం సచివాల యాల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులకు వెళ్లిన సచివాలయ సిబ్బంది ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కాలేదని సమాచారం చెప్పడంతో చాలా మంది వెనుదిగారు. గురువారం నుంచి పింఛన్ల పంపిణీని వేగవంతం చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ చెప్పారు.

➡️