రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు వీడితే నష్టం

రాజకీయ పార్టీలు

మాట్లాడుతున్న అప్పలస్యూనారాయణ

  • మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక సిద్ధాంతాలను విస్మరించి ఆర్థిక క్రమశిక్షణ తప్పితే ప్రజలు తప్పక బుద్ధి చెప్తారని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. అరసవల్లిలోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసిపి ఓటమికి ఇదే కారణమన్నారు. వైసిపి ఓడిపోతుందని ఎన్నికలకు ముందే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు చెప్పానన్నారు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎలా వచ్చిందో అని జగన్మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ నేతలు గత, వర్తమాన పరిణామాలను ఆకలింపు చేసుకుంటే భవిష్యత్‌ ఫలితాలను అంచనా వేయడం కష్టం కాదన్నారు. ప్రజామోదంతో విజయాన్ని అందుకున్న తర్వాత ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. నియంతృత్వ విధానాలను అనుసరిస్తే ఏ రాజకీయ పార్టీకైనా ఇదే గతి పడుతుందన్నారు. సిద్ధాంతాల ఆధారంగా రాజకీయాలు నడవాలి తప్ప ఆర్థిక లావాదేవీలతో ఎల్లకాలం నడపలేమన్న విషయాన్ని గ్రహించాలన్నారు.

➡️