నవధాన్యాల సాగుతో లాభాలు

ఖరోఫ్‌ సీజన్‌కు ముందు నవధాన్యాలు సాగు చేయడం

అవగాహన కల్పిస్తున్న ధనుంజయ

ప్రజాశక్తి- పోలాకి

ఖరోఫ్‌ సీజన్‌కు ముందు నవధాన్యాలు సాగు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ప్రకృతి వ్యవసాయం జిల్లా ఎడిషినల్‌ డిపిఎం ధనుంజయ తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో ఎపిఎం జి.రాజారావు అధ్యక్షతన నవధాన్యాలు సాగు-నేల తల్లి బాగు కార్యక్రమంలో భాగంగా రైతులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవధాన్యాలు సాగుతో భూమిలో పలు పోషకాలు కలిగి భూమి సారవంతంగా మారుతుందని తెలిపారు. ఈ నవధాన్యాలు 18 రకాల విత్తనాలు తోలకరి వర్షాలకు ముందు ఎకరాకి పది కేజీల వంతున వేసి 45 రోజులు తరువాత దుమ్ము చేసి పోలంలో మురగపెడితే షోషకాలు పెరుగుతాయని పేర్కొన్నారు. తద్వారా భూమి సారవంతంగా మారి వరి పంట దిగుబడిలు పెరుగు తాయని సూచించారు. ఈ నవధాన్యాలు విత్తనాలు పది కేజీల ప్యాకెట్లు వెలుగు కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని, కావలిసిన రైతులు వెలుగు అధికారులను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఎపిఎం రాజారావు, ఎన్‌ఎఫ్‌ ఎ.బాబిజీ, గోవిందరెడ్డి, రమణ, సీతారామయ్య పాల్గొన్నారు.

 

➡️