కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసనలు

కేంద్ర ప్రభుత్వం

జి.సిగడాం : పత్రులను దహనం చేస్తున్న రమణ తదితరులు

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యాన బుధవారం బెండి, నగరంపల్లి గ్రామాల్లో ప్రజలు నిరసన తెలిపారు. ఈ మేరకు బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కోర్నన బాలాజీరావు, మ్మినేని భాస్కరరావు, సిఐటియు నాయకులు ఎన్‌.మోహనరావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌ కేవలం అదానీ, అంబానీ లాంటి సంపన్నులకు తప్ప రైతులకు, వ్యవసాయ కూలీలకు, కార్మిక వర్గానికి ఎలాంటి లాభం చేకూర్చే కాదని విమర్శించారు. కార్యక్రమంలో కోనారి హేమసూదనరావు, రెళ్ల నీలాచలం, కోనారి ఆనంద్‌, యానాది లోకేష్‌, సర్వశుద్ధి మోహనరావు, నిర్మల, టి.లక్ష్మి, జి.కోదండ, దువ్వాడ ఆనందరావు నాయుడు. ఎన్‌.ధనలక్ష్మి, ఎన్‌.సోములు పాల్గొన్నారు.పలాస : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రైతాంగ వ్యతిరేక బడ్జెట్‌కు నిరసనగా బుధవారం మాకన్నపల్లిలో ప్రతులను ఎపి జీడి రైతు సంఘం ఆధ్వర్యాన దహనం చేశారు. ఈ సందర్భంగా జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జీడి పంటను కేంద్ర పంటల జాబితాలో చేర్చి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు తెప్పల అప్పలస్వామి, గేదెల నీలకంఠం, బత్తిన ప్రసాద్‌, తెప్పల రాజు, జుత్తు వరలక్ష్మి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. టెక్కలి రూరల్‌ : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధుల కోత, కార్మిక రంగంలో లేబర్‌ కోడ్లు అమలుకు వ్యతిరేకంగా స్థానిక చిన్నబజార్‌ కూడలి వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు నంబూరి షణ్ముఖరావు, జిల్లా ఉపాధ్యక్షులు హెచ్‌.ఈశ్వరరావు, రైతు సంఘం నాయకులు బగాది వాసుదేవరావు, జోగి కుమార్‌, ఎన్‌.శంకర్‌, ఎస్‌.వెంకటరావు, గేదెల వసంతులు, పి.ధనుంజయ, కమలమ్మ, దేవి పాల్గొన్నారు. జి.సిగడాం: కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర బడ్జెట్‌ ఉందని, సామాన్యులకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చేలా లేదని ఎపి రైతు సంఘం, జిల్లా కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ అన్నారు. రైతు, సామాన్యుల వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా మండలం సేతుభీమవరంలో ఎపి రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో బడ్జెట్‌ పత్రాలను దహనం చేశారు. కార్యక్రమంలో పోకతోట రాంబాబు, శాకాబత్తుల రమణ, అప్పారావు, బొల్లి జమ్మినాయుడు, కె.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ధర్నా…శ్రీకాకుళం అర్బన్‌: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను పక్కన పెట్టి కార్పోరేట్ల ప్రయోజనాన్ని కాపాడేందుకు ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌ను రూపొందించిందని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోలాకి వెంకటరావు, మాతల గోవర్థనరావులు ఆరోపించారు. నగరంలోని సంచార భవన్‌ వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ యూనియన్‌ నాయకులు అభిమన్యు, అరుణ, శ్రీను, హెచ్‌ ఢిల్లేశ్వరరావు, శివ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️