ప్రశ్న సమాజాభివృద్ధిలో కీలకం : యుటిఎఫ్ నేత ఎన్ వెంకటేశ్వర్లు

Sep 29,2024 13:40 #Srikakulam district., #utf

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : సమాజంలో ప్రశ్న జంతువు నుండి మనిషి విడువటానికి కీలకమైనది . చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించడం, ప్రశ్నించుకోవడం ద్వారానే ఉత్పత్తి జరిగిందని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా యుటిఎఫ్ కార్యాలయంలో మాజీ యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కే.రామలక్ష్మి 6వ సంస్మరణ సభ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్ బాబురావు అధ్యక్షతన జరిగింది ఈ సభలో ప్రధాన వర్తగా హాజరైన ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రశ్నించటం చైతన్యవంతంగా ఆలోచించటం మనిషి సహజమైన లక్షణమని ఆ లక్షణాన్ని కోల్పోకుండా నిరంతరం కొనసాగించడం ద్వారానే సమాజంలో ఆవిష్కరణలు, శాస్త్రీయ ద ృక్పదాలు, ఉత్పత్తులు సమాజాభివృద్ధి జరిగిందని తెలియజేశారు. వ్యక్తిగత చైతన్యం సంఘ చైతన్యంగా మార్చుకోవాలని, సంఘ చైతన్యం సామాజిక చైతన్యంగా అభివృద్ధి చేసుకోవడం తద్వారా వర్గ చైతన్యం ప్రతివారు అలవర్చుకోవాలని కోరారు. శ్వాస మీద ధ్యాసించే వాళ్ళ కంటే, శ్రమ మీద ధ్యాస ఉంచే వారి సంఖ్య పెరగాలని, అదే సమాజానికి ఉపయోగమని తెలిపారు. రుగ్మతలు లేని సమాజం కోసం మనందరం కృషి చేయటమే రామలక్ష్మి గారికి ఇచ్చే ఘన నివాళి అని తెలిపారు.
ఉత్తరేంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ. అజా శర్మ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఆదర్శ భావాలు వెలసిల్లాయని, ఆ సందర్భంలోనే ఆదర్శ వివాహాలు, భావాలు ఏర్పడ్డాయి అని తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మతోన్మాద శక్తులు అశాస్త్రీయమైన అంశాల్ని సమాజంలోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అభ్యుదయ భావాలు తిరిగి అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలని తెలియజేశారు. పురుషాధిక్యత ,కుల మత ఉన్మాదాలు నేటి సమాజంలో అంగీకరిస్తామా? సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తామా ప్రశ్నించుకోవలసిన సమయం అసన్న మైనదని తెలియజేశారు.. ఈ సంస్మరణ సభలో రామలక్ష్మీ వ్రాసిన నేనోక కవిత్వం పుస్తకాన్ని కథ నవలా రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు A. అప్పలనాయుడు ఆవిష్కరించారు. చింతాడ తిరుపతిరావు కవి కథా రచయిత ఈ పుస్తకం పై సమీక్ష చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కిషోర్ కుమార్, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి శ్రీరామ మూర్తి, కార్యవర్గ సభ్యులు ch. రవీంద్ర మాట్లాడుతూ చిన్ననాటి నుంచి అభ్యుదయ భావాలను అలవర్చుకొని, ఉపాధ్యాయ వృత్తిలో చేరిన తర్వాత యుటిఎఫ్ లో చేరి మంచి ఉపాధ్యాయులుగా కొనసాగారని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ విద్య ను కాపాడుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేయాలని కోరారు. రామలక్ష్మి భర్త కె.అప్పారావు మాట్లాడుతూ రామలక్ష్మి గారి ఆశయాలను కుటుంబం పాటిస్తుందని, వాటిని ముందుకు తీసుకెళ్లడం కోసం కృషి చేస్తున్నామని , ఈ సంస్కరణ సభ జరగటంలో సహకరించిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిక్కోలు ట్రస్ట్ బాధ్యులు D. రవికుమార్, సాహితీ స్రవంతి కన్వీనర్ శ్రీనివాస్ ,కవి రచయితలు సిద్ధార్థ రామారావు, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం వాగ్దేవి, యుటిఎఫ్ జిల్లా సహాఅధ్యక్షులు B. ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️