ఇంద్రధనస్సు మెరిసె.. సూర్యచంద్రులు మురిసె…

ఆకాశంలో గురువారం అరుదైన దృశ్యం

సూర్యుని చుట్టూ ఏర్పడిన ఇంద్రధనస్సు

ప్రజాశక్తి – కవిటి

ఆకాశంలో గురువారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గురువారం మధ్యాహ్నం సూర్యుడు చుట్టూ అల్లుకున్న ఇంద్రధనస్సు, రాత్రి చంద్రుని చెంతకు చేరింది. సాధారణంగా సూర్యకాంతి వలన కలిగే ఇంద్రధనస్సు ఎప్పుడూ సూర్యునికి నేరుగా, ఎదురుగా ఉన్న ఆకాశంలో కనిపిస్తాయి. గురువారం మధ్యాహ్నం సూర్యుని చుట్టూ రాత్రి చంద్రుని చుట్టూ వలయంలా ఏర్పడం విశేషం. దీంతో పలువురు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం చేశారు.

 

➡️