4న ర్యాలీలు నిషేధం

రంజూన్‌ 6 వరకు ఎన్నికలు

సమీక్షిస్తున్న డిఎస్‌పి నాగేశ్వరరావురెడ్డి

  • కాశీబుగ్గ డిఎస్‌పి నాగేశ్వరరావురెడ్డి

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

జూన్‌ 6 వరకు ఎన్నికలు కోడ్‌ అమలులో ఉందని, రాజకీయ పార్టీల నాయకులు జాగ్రత్తలు పాటించాలని కాశీబుగ్గ డిఎస్‌పి నాగేశ్వరరావురెడ్డి సూచించారు. సర్కిల్‌ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్‌ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు చేశామన్నారు. అలాగే బాణసంచా విక్రయంపైనా నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. టపాసులు విక్రయించినా, కాల్చినా బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సిఐ టి.ఇమ్మాన్యునల్‌రాజు, మల్లేశ్వరరావు, ఎస్‌ఐలు సత్యనారాయణ, లక్ష్మణరావు, రాము పాల్గొన్నారు.

➡️