ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్‌నాయుడు నామినేషన్‌

తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం

నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ను కలిసి నామి నేషన్‌ పత్రాలను అందజేశారు. ఆయనతో పాటు ఆయన చిన్నాన్నలు కింజరాపు హరివర ప్రసాద్‌, కింజరాపు అచ్చె న్నాయుడు, మాజీ మంత్రి గౌతు శివాజి, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణలు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయం, తాగునీటి అనుసంధానం, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయమన్నారు. రాష్ట్ట్ర ప్రజలను మరో మారు మోసం చేసేందుకు జగన్‌ చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలన్నారు. వారితో పాటు ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, కొర్ను ప్రతాప్‌, పిఎంజెబాబు, సింతు సుధాకర్‌ పాల్గొన్నారు.

 

➡️