ప్రజాశక్తి-లక్ష్మీనర్సుపేట : అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎ.పి.అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ (సిఐటియు) ఆద్వర్యంలో ఈరోజు పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావుకి లక్ష్మీనర్సుపేట మండలం రావిచంద్రి జంక్షన్ వద్ద యూనియన్ నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు కె.వి.హేమలత, కె.లక్ష్మి.మాట్లాడుతూ కొత్తూరు ఐ.సి.డి.యస్.ప్రోజెక్ట్ పరిథిలో హిరమండలం L.N.పేట.మండలాల్లో విధుల్లో ఉంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ నలుగురు ఇటీవల అనారోగ్యంతో మరణించారని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేక అంగన్వాడీ కార్యకర్తలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరణించిన అంగన్వాడీ కుటుంబానికి మట్టి ఖర్చులు నిమిత్తం 20 వేలు రూపాయిలు ఇవ్వాలని గత సమ్మెకాలంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలకు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.లు విడుదల చేయాల, కొత్తూరు ప్రోజెక్ట్ పరిదిలో ఇటీవల మరణించిన అంగన్వాడీ కార్యకర్తలు కుటుంబాలుకు ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. అర్హులైన వారి కుటుంబ సభ్యులకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్ గా ఉద్యోగం ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా.అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని వారు శాసనసభ్యులు ఎంజీఆర్ కి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీలకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుదీష్ణ, సుభాషినీ, నిర్మల, లక్ష్మీ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.