- 158 దుకాణాలకు దరఖాస్తులకు ఆహ్వానం
- రూ.55 లక్షల శ్లాబ్‌లో 18 దుకాణాలు
- రూ.65 లక్షల శ్లాబ్‌లో 140 దుకాణాలు
- 11న అంబేద్కర్ ఆడిటోరియంలో లాటరీ
- 12న కొత్త షాపులు ప్రారంభంగెజిట్ నోటిఫికేషన్ విడుదల
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం విధానానికి అనుగుణంగా రిటైల్ వ్యాపార దుకాణాలకు లైస్సెన్స్ మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పాలనా వ్యవహారాలు చూసిన ఎక్సైజ్‌శాఖ తాజాగా జారీ చేసిన గెజిట్‌లో 30 మండలాల పరిధిలోనే దుకాణాలకు లైసెన్సులను మంజూరు చేయనుంది. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న 12 ఎక్సైజ్ స్టేషన్లు (ఆఫ్‌లైన్) విధానాల్లో తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
నూతన మద్య విధానం విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో జిల్లాలో అధికారులు గెజిట్ నోటిఫికేషన్ వెలువరించారు. జిల్లాలోని 30 మండలాల పరిధిలో మొత్తం 158 దుకాణాలకు లైసెన్స్‌లు ఇవ్వనున్నట్లు అందులో పొందుపరిచారు. మద్యం షాపుల కేటాయింపు కోసం ప్రభుత్వం నాలుగు శ్లాబ్‌లుగా నిర్ణయించింది. పది వేల జనాభా లోపు రూ.55 లక్షలు, పది వేలు దాటి 50వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.65 లక్షల మేర లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 50 వేలు దాటి ఐదు లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.75 లక్షల రుసుము, ఐదు లక్షల జనాభా దాటితే రూ.85 లక్షల ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. నాలుగు శ్లాబుల్లో జిల్లాలో మొదటి రెండు కేటగిరీలు మాత్రమే ఉన్నాయి. రూ.55 లక్షల శ్లాబ్‌లో 18 దుకాణాలు ఉండగా, రూ.65 లక్షల కేటగిరీలో 140 దుకాణాలు ఉన్నాయి. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 14 షాపులు ఉన్నాయి. ఇవన్నీ రూ.65 లక్షల శ్లాబ్ కేటగిరీలో ఉన్నాయి. పలాస మున్సిపాలిటీలో రూ.65 లక్షలతో షాపులను కేటాయించనుంది. మండల కేంద్రాల విషయానికి వస్తే రణస్థలంలో రూ.65 లక్షల శ్లాబ్ కింద పది దుకాణాలను కేటాయించారు. కంచిలిలో రూ.65 లక్షల శ్లాబ్‌తో ఒక షాపునకు మాత్రమే లైసెన్స్ మంజూరు చేయనున్నారు.ఇతర నిబంధనలు ఇవే…ఒక దుకాణానికి ఒకరు కంటే ఎక్కువ మంది దరఖాస్తులు చేస్తే అర్హులైన వారిని గుర్తించి లాటరీ పద్ధతిన లైసెన్స్ కేటాయించనున్నారు. దరఖాస్తుదారుడు మాత్రమే అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలైనా పొందవచ్చని, ఎటువంటి ఆంక్షల్లేవని గెజిట్‌లో పేర్కొన్నారు. దుకాణం దక్కించుకున్న రోజు గానీ బ్యాంకు పనిచేసే రోజున బ్యాంకు గ్యారంటీ సమర్పించకుంటే ఆ తర్వాత ఉన్న దరఖాస్తుదారునికి షాపును కేటాయిస్తారు. ఆ దుకాణానికి ఎక్కువ దరఖాస్తులు వస్తే మళ్లీ లాటరీ తీసి కేటాయించనున్నారు.11న అంబేద్కర్ ఆడిటోరియంలో లాటరీ మద్యం దుకాణాలకు ఈనెల తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 11న ఉదయం ఎనిమిది గంటలకు శ్రీకాకుళం నగరంలోని బి.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో లాటరీ నిర్వహించనున్నారు. అందులో విజేతలైన వారికి దుకాణాలను కేటాయించనున్నారు. ఆ మరుసటి రోజు నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి. దుకాణాలు దక్కించుకున్నవారు మున్సిపల్, మండల ప్రాంతాల్లో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు.దరఖాస్తుల స్వీకరణ ఇలా…జిల్లాలో మంగళవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఈనెల తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే వారు ష్ట్ర్‌్‌జూర//ష్ట్రజూరజూతీశీjవష్.షశీఎ వెబ్‌సైట్‌లో పంపాలి. దరఖాస్తులను నేరుగా ఇవ్వాలనుకునే వారు ఆయా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లలో అందజేయవచ్చు. పూర్తి వివరాలకు ఎచ్చెర్ల కింతలిమిల్లు వద్ద ఉన్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సంప్ర దించవచ్చని సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు తెలిపారు.వీరు అనర్హులుమద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసే వారు 21 లోపు వయసు ఉండకూడదు. పదేళ్ల కాలంలో ఏ ఒక్క నేరంలోనూ శిక్ష అనుభవించి ఉండకూడదు. శిక్ష పడినట్లు తేలితే ఏ సమయంలోనైనా లైసెన్స్ రద్దు చేయనున్నారు. ఎక్సైజ్‌శాఖ జాబితాలో డిఫాల్టర్లుగా ఉంటే అటువంటి వారిని అనర్హులుగా పరిగణించనున్నారు.