భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

భూ సమస్యలను

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమణమూర్తి

ప్రజాశక్తి – నరసన్నపేట

భూ సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలోని మడపాంలో మంగళవారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు. సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామన్నారు. సమస్య పరిష్కారమైందా, లేదా అన్నది ఫోన్‌కి మెసేజ్‌ వస్తుందన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులంతా రెవెన్యూ సదస్సులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రజలు నేరుగా వచ్చి తమ వినతిపత్రాల ద్వారా రికార్డుల్లో పరిస్థితిని తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌, ఎంపిడిఒ, మండల ప్రత్యేకాధికారి, టిడిపి మండల అధ్యక్షులు శిమ్మ చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి అడపా చంద్రశేఖర్‌, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️