మాట్లాడుతున్న ట్రాఫిక్ ఎస్‌ఐ దేవదానం
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యం అనేక సందర్భాల్లో కారణమవుతుందని, అందువల్ల రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ ఎస్‌ఐ దేవదానం అన్నారు. నగరంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న గ్యారేజీలో రహదారి భద్రతా వారోత్సవాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు అమ్రత్తంగా ఉండాలన్నారు. ఏకాగ్రత, ఇతర వాహనాలు నడిపే వారి స్థితిని గుర్తించి వాహనాలను నడపడం కీలకమన్నారు. ప్రయాణికులకు భరోసా కలించేలా వాహనాలను నడపాలన్నారు. రెండో డిపో మేనేజర్ శర్మ మాట్లాడుతూ ప్రమాదరహిత సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే ఆర్‌టిసి లక్ష్యమన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో డ్రైవర్లదే కీలక పాత్ర అన్నారు. ఆర్‌టిసిపై ప్రయాణికులకు ఎంతో నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం-1,2 సహాయ మేనేజర్లు రమేష్, గంగరాజు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎల్.ఎస్.నాయుడు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్లు భాస్కరరావు, మూర్తి, భద్రత, నిఘా విభాగం సిబ్బంది, డ్రైవర్లు, మెకానిక్‌లు పాల్గొన్నారు.