11 నుంచి ఇసుక నూతన విధానం

ఉచిత ఇసుక నూతన విధానం సెప్టెంబరు

మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఉచిత ఇసుక నూతన విధానం సెప్టెంబరు 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో తప్పక పాటించాలన్నారు. ఇసుక విధానంపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ ఇసుక విధానంపై ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 18005994599, సఎస్త్రaజూఝఅసషశీఎజూశ్రీaఱఅ్‌రఏyaష్ట్రశీశీ.షశీఎ మెయిల్‌ అందుబాటులో ఉందని, దీన్ని విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆన్‌లైన్‌ పోర్టల్‌ , గడువు తేదీలు, మ్యాన్‌ పవర్‌, ఏజెన్సీల నియామకం, స్టాక్‌యార్డ్‌ ఇన్‌ఛార్జీలు, సెక్యూరిటీ పర్సనల్‌, ఇతర స్టాల్‌ల నియామకం, సిబ్బందికి శిక్షణ, టెండర్‌ ప్రక్రియ ద్వారా తవ్వకం, లోడింగ్‌ తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, గనులశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎస్‌.కె.వి సత్యనారాయణ, ఫణిభూషణ్‌ రెడ్డి, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌, నీటిపారుదలశాఖ ఎస్‌ఒ పొన్నాడ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️