రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న సిఐ నాగరాజు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
పుట్టిన రోజు వేడుకలను ఆడంబరంగా జరుపుకుంటున్న ఈరోజుల్లో తనవంతు బాధ్యతగా సామాజిక సేవ చేసేందుకు ముందుకొచ్చిన శివతేజ అభినందనీయుడని ట్రాఫిక్ సిఐ నాగరాజు అన్నారు. గురువారం మానవతా స్వచ్చంద సంస్థ భాగస్వామ్యంతో శివతేజ చేపట్టిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. లైన్స్ బ్లడ్ బ్యాంకులో తలసేమియా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదానం చేశారు. ఈ శిబిరంలో మానవతా స్వచ్ఛంద సేవాసంస్థ చైర్మన్ ప్రొఫెసర్ డా.విష్ణుమూర్తి, వైస్‌చైర్మన్ నటుకుల మోహన్, లైన్స్ బ్లడ్ బ్యాంకు అధ్యక్షులు పొన్నాడ రవి కుమార్, నేషనల్ లా యూనివర్సిటీ ఎల్.ఎల్.బి విద్యార్థిని పోన్నాడ యోజిత, ఎన్‌సిసి క్యాడెట్‌లు దేవర ప్రసాద్, కందుకూరి జయ సూర్య తదితరులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మానవత సభ్యులు టెక్కం రామ్ గోపాల్, పొడుగు చరణ్, గుత్తు చిన్నారావు, లైన్స్ బ్లడ్ బ్యాంకు మేనేజర్ కొంతం సునీల్, టెక్నీషియన్ కె. దుర్గ, వై.వందన పాల్గొన్నారు.