నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలి

ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన ఆహారం

పరిశీలిస్తున్న జిల్లా ఫుడ్‌ కంట్రోల్‌ అధికారి వెంకటరత్నం

జిల్లా ఫుడ్‌ కంట్రోల్‌ అధికారి కె. వెంకటరత్నం

ప్రజాశక్తి – గుజరాతీపేట

ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని జిల్లా ఫుడ్‌ కంట్రోల్‌ అధికారి కె.వెంకటరత్నం చెప్పారు. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు సరఫరా చేసే ఆహారాన్ని ఆస్పత్రి డైటీషియన్‌ సమక్షంలో శుక్రవారం పరిశీలించారు. ఆహారం సరఫరా చేసేందుకు లైసెన్స్‌ లేదని లైసెన్స్‌ పొందాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆహారం తయారు చేసే ప్రాంతంలో పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆహారం తయారు చేసే వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. సూచించిన సూచనలు సరిచేసుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వచ్చే వారికి నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తే వారి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుందని వివరించారు. ఆహారం నాణ్యత పెంచాలని నోటీసు జారీ చేశారు. పరిశీలనలో ఫుడ్‌ సేఫ్టీ అధికారి లక్ష్మి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️