మాట్లాడుతున్న జెసి ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
- జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణా తరగతులను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యాభివృద్ధిని పొందాలన్నారు. కాలానుగుణంగా కార్యాలయాలకు ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎక్సెల్ షీట్స్ తదితర వాటిపై కంప్యూటర్‌లో శిక్షణ తీసుకొని సాంకేతికత నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.