ఒంటరి ఇళ్లు, మహిళలే లక్ష్యం

జిల్లాలోని సరుబుజ్జిలి, ఆమదాలవలస, పొందూరు, బూర్జ, జలుమూరు, నరసన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం రూరల్‌

నిందితులను ప్రవేశపెట్టిన ఎస్‌పి మహేశ్వర రెడ్డి

చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్టు

రూ.33.03 లక్షల నగదు, 31 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

ఎస్‌పి మహేశ్వర రెడ్డి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలోని సరుబుజ్జిలి, ఆమదాలవలస, పొందూరు, బూర్జ, జలుమూరు, నరసన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ఒంటరి ఇళ్లు, మహిళలే లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడారని ఎస్‌పి కె.వి.మహేశ్వర రెడ్డి అన్నారు. లావేరు మండలం అదపాక, విజయనగరం జిల్లా సంతకవిటి మండలం తాలాడ గ్రామాలకు చెందిన పిన్నింటి సంతోష్‌, గట్టిమ ఆనంద్‌, రాగోలు రాంబాబులను చోరీలకు పాల్పడిన నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్‌ కార్యాలయం లో శనివారం నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముగ్గురు నిందితులూ 15 చోరీలకు పాల్పడినట్టు గుర్తించామన్నారు. వారి నుంచి రూ.33.5 లక్షల నగదు, 31తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరితో పాటు మరో ముగ్గురు నింది తుల కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. సరుబు జ్జిలి కూడలి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా… బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పట్టుకుని విచారించామన్నారు. వారు చోరీ సొత్తును ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడిలో విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుబడినట్టు వివరించారు. వీరిపై విజయనగరం జిల్లాలో కూడా పలు కేసులు నమోదయ్యాయని అన్నారు. పట్టుబడ్డ నిందితులు రాత్రి సమయాల్లో కారును అద్దెకు తీసుకుని వెళ్తుంటారని అన్నారు. ఇంటికి దూరంగా కారును నిలిపి కాలినడకన నిద్రిస్తున్న సమయానికి ఇంట్లోకి ప్రవేశించేవారని వివరించా రు. చోరీలకు పాల్పడినప్పుడు నిద్రిస్తున్న మహిళల మెడలో ఉన్న వాటిని తెంపుకుని వెళ్లడం, తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీకి పాల్పడినప్పుడు బీరావాలను ఇంటికి దూరంగా తీసుకెళ్లి పొలాల్లో వాటిని పగల గొట్టి సొత్తును తీసుకెళ్లి పోవడం వారి నైజమని చెప్పారు. గతంలో పిన్నింటి సంతోష్‌ వేర్వేరు వ్యక్తులతో కలిసి 20 నేరాలకు పాల్పడినట్టు తెలిపా రు. కేసుల్లో నిందితులను చాకచక్యంగా పట్టుకోవ డంలో శ్రీకాకుళం డిఎస్‌పి సిహెచ్‌.వివేకానంద, ఇన్‌స్పెక్టర్లు పైడపు నాయుడు, సూర్యచంద్ర, జె.శ్రీ నివాసరావు, పి.సత్యనారాయణ, ఎస్‌.బాలరాజు, ఎస్‌ఐలు సిహెచ్‌.దుర్గాప్రసాద్‌, కె.కృష్ణప్రసాద్‌, కె.మధుసూదనరావు చురుగ్గా వ్యవహరించడంతో వారిని అభినందించారు.

 

➡️