గంజాయితో ఆరుగురు అరెస్టు

గంజాయి తరలిస్తున్న

వివరాలను వెల్లడిస్తున్న సిఐ చిన్నంనాయుడు

ప్రజాశక్తి – ఇచ్ఛాపురం

గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్ఛాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఇచ్ఛాపురానికి చెందిన బోర లోకేష్‌, కత్తుల అనిల్‌, కీలు ఢిల్లేశ్వరరావు, ఒడిశాకు చెందిన మునకాల శ్యామ్‌, మాడా ఆశిష్‌, కె.సంతు ఒడిశా రాష్ట్రం కె.సువాని గ్రామంలో గంజాయిని కొని తమిళనాడుకు తరలించేందుకు ఇచ్ఛాపురం చేరుకున్నారు. అక్కడ్నుంచి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా ఎస్‌ఐ చిన్నంనాయుడు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారి నుంచి 2.350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి అలవాటు పడిన నిందితులు వాటిని విక్రయించడం కూడా చేస్తున్నారని చెప్పారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐ చిన్నంనాయడు పాల్గొన్నారు.

➡️