ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పల్లె నిద్ర

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పల్లె

ఎమ్మెల్యే గొండు శంకర్‌

ప్రజాశక్తి – గార

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. పల్లె నిద్రలో భాగంగా మండలంలోని బందరువానిపేటలో శుక్రవారం బస చేశారు. సాయంత్రం నుంచి గ్రామంలోని అన్ని వీధుల్లో పర్యటిస్తూ పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య మెరుగుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సకాలంలో కాలువల్లో పూడికలు తొలగించాలని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా దోమల మందును పిచికారీ చేయాలన్నారు. ముఖ్యంగా మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తోందని తెలిపారు.

ఫొటో:

➡️