పొగ మంచు పగ

ఉత్తర కోస్తా

పూత దశలో ఉన్న జీడి చెట్లు

* జీడి, మామిడికి మంచు దెబ్బ

* రాలిపోతున్న పూతవి

  • జృంభిస్తున్న తెగుళ్లు

* ఆందోళనలో రైతులు

సస్యరక్షణ చర్యలు తప్పనిసరికొద్దిరోజులుగా దట్టంగా కురుస్తున్న పొగ మంచుతో జీడి, మామిడి పంటలకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం చెట్లన్నీ నిండా పూతతో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో మంచు విపరీతంగా కురుస్తుండడంతో పూత రాలిపోవడంతో పాటు తెగుళ్లు విజృంభిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. జిల్లాలో సుమారు 52 వేల ఎకరాల్లో జీడి, మామిడి తోటలు ఉన్నాయి. సాధారణంగా డిసెంబరు మొదటి వారం నుంచే మామిడి, జీడి చెట్లకు పూత వస్తుంటుంది. గతేడాది నవంబరు, డిసెంబరులో వర్షాలు పడడంతో పూత రావడం కొంత ఆలస్యమైంది. జనవరి నుంచి పూత పూయడం ప్రారంభమైంది. ఇప్పటికే తెల్లదోమ ప్రభావంతో ఉద్యానవన పంటలపై నల్లటి పొర ఏర్పడుతుంటే, దానికి తోడుగా పొగమంచు కురుస్తుండడం పూతపై ప్రభావం చూపిస్తోంది. మంచు ప్రభావంతో టి దోమ ఉధృతి పెరుగుతోంది. తోటల్లో కలుపు ఎక్కువగా ఉండడంతో, చాలా ప్రాంతాల్లో ఈ తెగుళ్లు శరవేగంగా వ్యాపిస్తున్నాయి.

ప్రజాశక్తి – కవిటి

ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎక్కువగా కనిపించే టి దోమ, ఆకు, పూత గూడుకట్టు పురుగు, పండినల్లి వంటి పురుగులు పంటకు తీవ్రమైన హాని కలిగిస్తాయని ఉద్యానశాఖ అధికారులు చెప్తున్నారు. ఇటువంటి సమయంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.టి దోమటి దోమ పిల్ల పురుగులు, తల్లి పురుగులు జీడి, మామిడి చెట్ల లేత కొమ్మలు, పూత రెమ్మలను ఆశించి వాటి రసాన్ని పీల్చేస్తాయి. దీంతో ఎర్రని జిగురు లాంటి బిందువులు పూత రెమ్మలపైన ఏర్ప డతాయి. దీనివల్ల పూత, పింది మాడిపోయి రాలిపో యి దిగుబడిలో భారీగా తగ్గుదల ఏర్పడుతుంది. నివారణచిగురు దశలో లీటరు నీటిలో మోనో క్రోటోఫాస్‌ 1.5 ఎంఎల్‌ కలుపుకొని పిచికారీ చేయాలి. పూత వచ్చిన తర్వాత మరోసారి చేసుకోవాలి. రెండోసారి పిచికారీ చేసుకునే సమయంలో ల్యామ్డా ఫైలాహోత్రి లీటరు నీటిలో 0.6 ఎంఎల్‌ కలుపుకోవాలి. లేకుంటే క్లోరిఫైరిపాస్‌ లీటరు నీటిలో 2 ఎంఎల్‌ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. గింజ ఏర్పడుతున్న దశలో లీటరు నీటిలో ప్రొఫినోపాస్‌ ఒక ఎంఎల్‌ కలిపి పిచికారీ చేసుకోవాలి.ఆకు, పూత గూడుకట్టు పురుగుటి దోమతో పాటు ఆకు, పూత గూడుకట్టు పురుగు జీడి, మామిడి పంటలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ పురుగు లేత మొక్కలకు ఎక్కువగా హాని కలిగిస్తుంది. ముఖ్యంగా కొత్త చిగురు, పూత దశలో ఈ పురుగు ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఆకుల్ని, పూతను గూడు కట్టుకుం టూ పోతుంది. దాంతో కొమ్మల చివర బూజు ఏర్పడి, పూత బాగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇది ఎదుగుతున్న గింజలు, పండును గీకి తినడంతో పంట నాణ్యత తగ్గిపోవడమే కాకుండా దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. వీటితో పాటు తామర పురుగుల బెడద కూడా పెరిగే ప్రమాదం ఉంది. నివారణమోనోక్రోటోపాస్‌ లీటరు నీటిలో 1.6 ఎంఎల్‌ కలుపుకుని పిచికారీ చేయాలి. లేకుంటే ధైమీదియోట్‌ లీటరు నీటిలో 2 ఎంఎల్‌ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. పండినల్లి పురుగుపండినల్లి పురుగు కూడా జీడి, మామిడి పంటలను ఆశించే ప్రమాదం ఉంది. పిండినల్లి తల్లి, పిల్ల పురుగులు లేత ఆకుల కాండం, పుష్పాలు, కాయలు నుంచి రసాన్ని పీల్చేస్తాయి. పిండినల్లి ఆశించిన చెట్టు పాలిపోయినట్టు కనిపిస్తుంది. తేనె వంటి జిగురు ద్రవం ఏర్పడి, ఆకులు పువ్వులపైన నల్లని మసిలా ఏర్పడుతుంది.నివారణపిండినల్లి నివారణకు డైఫ్లోర్వస్‌ లీటరు నీటిలో 2.5 ఎంఎల్‌ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేకుంటే లీటరు నీటిలో ఎసిఫెట్‌ 1.5 గ్రాములు కలుపుకొని పిచికారీ చేయాలి. ఇవే కాకుండా ఎదుగుతున్న గింజలు రాలిపోవడం, మెత్తబడిపోవడం, నల్లగా మారిపోవడం వంటి లక్షణాలు గమనిస్తే కార్బండిజం లీటరు నీటిలో ఒక గ్రాము కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు పూత రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మల్టీ కె, 191919 లీటరు నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి.సస్యరక్షణ చర్యలు తప్పనిసరి సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా జీడి, మామిడి పంటలను కాపాడుకోవచ్చు. ముఖ్యం గా టి దోమ, పిండినల్లి, ఆకు పూత గూడుకట్టు పురుగులు జీడి, మామిడి పంటలకు భారీ నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు ఉద్యానవన శాఖ అధికారులు సూచించిన మందులు పిచికారీ చేయడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చు.

➡️