సామాజిక సంఘ సంస్కర్త వేమన

సామాజిక సంఘ సంస్కర్త, తెలుగు

వేమన చిత్రపటానికి నివాళ్లరిస్తున్న ఎమ్మెల్యే, జెసి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సామాజిక సంఘ సంస్కర్త, తెలుగు సమాజానికి తన పద్యాల ద్వారా వెలుగులు నింపింది వేమన అని ఎమ్మెల్యే గొండు శంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు. వేమన జయంతిని పురస్కరించుకుని బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఆదివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసుకున్న ప్రజా కవి యోగి వేమన అని అన్నారు. సరళమైన వాడక భాషలో అర్థవంతమైన పద్య రచనలు చేశారన్నారు. పిల్లలు మొదలు పెద్దల వరకు వేమన పద్యాలను తెలియని వారు ఉండరన్నారు. ఆయన రాసిన పద్య కావ్యాలకు అత్యంత ప్రజాదరణ ఉందని, నేటికీ ఈ ఆదరణ చెక్కు చెదరడం లేదన్నారు. ఆయన రాసిన పద్య రచనల్లో విశ్వదాభిరామ వినురవేమ నిర్వచనంతో కూడిన పదాలు ఎప్పటికీ మరిచిపోలేనివన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, బిసి సంక్షేమశాఖ అధికారి అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.జిల్లా పోలీసు కార్యాలయంలో… యోగి వేమన జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్‌పి (అడ్మిన్‌) కె.వి రమణ వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని సమస్యలను భిన్న కోణాల్లో దర్శించి వాటిని తన పద్యాల్లో ప్రదర్శించారని కొనియాడారు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాష, చక్కటి పదజాలం, ఉదాహరణలతో హృదయాన్ని హత్తుకునేలా పద్యాల రూపంలో సమాజానికి అర్థమయ్యే రీతిలో చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్మ్‌డ్‌ రిజర్వు డిఎస్‌పి ఎల్‌.శేషాద్రి, ఆర్‌ఐ కె.నర్సింగరావు, పోలీసు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️