జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా
ప్రజాశక్తి – గార
జైల్లో ఖైదీలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా అధికారులను ఆదేశించారు. మండలంలోని అంపోలులో గల జిల్లా జైలులో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డితో కలిసి శుక్రవారం ఖైదీలకు న్యాయ అవగాహనా సదస్సు నిర్వహించారు. ముందుగా జైలు పరిసరాలను పరిశీలించారు. జైల్లో తాగునీరు, వైద్యం తదితర అంశాలపై ఖైదీలతో మాట్లాడి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి టి.వి బాలమురళీకృష్ణ, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ జాన్ సుధాకర్, డిఇఒ తిరుమల చైతన్య పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.