మానసికోల్లాసానికి క్రీడలు దోహదం

మానసిక ఉల్లాసానికి క్రీడలు

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – కోటబొమ్మాళి

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి ఉత్సవాల నేపథ్యంలో స్థానిక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తి ముఖ్యమన్నారు. క్రీడలు యువతలో మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తాయన్నారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం రెండు టీమ్‌లకు టాస్‌ వేసి కబడ్డీ పోటీలను ప్రారంభించి తిలకించారు. ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్‌, మాజీ ఎంపిపి టి.రామకృష్ణ, వి.విజయలక్ష్మి, టెక్కలి సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సత్యనారాయణ, కొత్తమ్మతల్లి ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

➡️