క్రీడాకారుల పయనం

జ్ఞాన భారతి సీనియర్‌ సెకండరీ పాఠశాల చెందిన

క్రీడాకారులతో జోహార్‌ఖాన్‌

ఇచ్ఛాపురం:

జ్ఞాన భారతి సీనియర్‌ సెకండరీ పాఠశాల చెందిన విద్యార్థులు ఈ నెల 27 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న సౌత్‌ జోన్‌ హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో పాల్గొనేందుకు గురువారం పయనమయ్యారు. అండర్‌-19 బాలురు విభాగంలో వారు పోటీ పడనున్నారు. జ్ఞాన భారతి జట్టులో 16 మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఈ నెల 27 నుంచి గుంటూరులో జరిగే సిబిఎస్‌ ఈ క్లస్టర్‌-7 బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొనేందుకు బాలురు జట్టు బయలుదేరి వెళ్లింది. బ్యాడ్మింటన్‌ పోటీల్లో అండర్‌-14 విభాగంలో ఇద్దరు బాలురు, అండర్‌-19 విభాగంలో ఇద్దరు బాలురు పోటీలో పాల్గొనడా నికి తరలివెళ్లారు. వారితో పాటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కైలాస్‌ కుమార్‌ పండా, డి.రాము వెళ్లారు. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ వద్ద జ్ఞాన భారతి ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ సెక్రెటరీ, సిఇఒ జోహార్‌ ఖాన్‌ విజయోస్తు ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో ట్రస్టీ వజ్రపు రమణమూర్తి, ప్రిన్సి పాల్‌ ఐ.బి.పండా, హెడ్‌మిస్ట్రెస్‌ రషీదా సుల్తానా, మేనేజర్‌ ప్రమోద్‌కుమార్‌, అదనపు పరిపాలనా అధికారి సయ్యదా సుల్తానా, ట్రాన్స్‌పోర్టు మేనేజర్‌ అలీమ్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

 

➡️