అరసవల్లిని సందర్శించిన ఎస్‌పిలు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి

చిత్రపటాన్ని అందుకుంటున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని శ్రీకాకుళం, అనకాపల్లి ఎస్‌పి జి.ఆర్‌ రాధిక, కె.వి మురళీకృష్ణ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఆలయంలో స్వామి వారి సేవల అనంతరం అనివెట్టి మండపంలో వారికి శేష వస్త్రాలను కప్పి చిత్రపటాలను ఆలయ ఇఒ చంద్రశేఖర్‌ అందజేశారు. వారితో పాటు రూరల్‌ సిఐ ఎల్‌ సన్యాసినాయుడు, ఒకటో పట్టణ ఎస్‌ఐ గణేష్‌ పాల్గొన్నారు.అరసవల్లికి రూ.9.75 లక్షల ఆదాయంవైశాఖ మాసం ఆదివారం కావడంతో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి సందర్శకుల తాకిడి పెరిగింది. రద్దీ పెరగడం వల్ల టిక్కెట్ల రూపంలో రూ.6,09,300, విరాళాల రూపంలో రూ.95,201, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2,71,405 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు.

➡️