ఇఎపిసెట్‌లో మెరిసిన విద్యార్థులు

ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో

విద్యార్థులను అభినందిస్తున్న కాకినాడ ఆదిత్య ప్రిన్సిపాల్‌ ఢిల్లేశ్వరరావు

  • ఇంజినీరింగ్‌లో సతీష్‌ కుమార్‌ 81వ ర్యాంకు
  • అగ్రికల్చర్‌లో పణవ్‌సాయికి 12వ ర్యాంకు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, అర్బన్‌, టెక్కలి, పోలాకి

ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎపి ఇఎపిసెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. ఇంజినీరింగ్‌, వ్యవసాయం విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్‌లో జలుమూరు మండలం కరవంజకు చెందిన చింతు సతీష్‌ కుమార్‌ 81వ ర్యాంకు సాధించాడు. తండ్రి బుచ్చన్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తల్లి రమాదేవి గృహిణి. శ్రీకాకుళం నగరం ఇందిరానగర్‌ కాలనీ పరిధిలోని గోవిందనగర్‌కు చెందిన మావూరు జశ్వంత్‌కు 84వ ర్యాంకు వచ్చింది. నరసన్నపేటలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన కోరాడ సౌదీప్‌కు 124వ ర్యాంకు వచ్చింది. తండ్రి కోరాడ వైకుంఠరావు నరసన్నపేట మండలం కంబకాయ జెడ్‌పి హైస్కూల్‌లో పనిచేస్తున్నారు. తల్లి దుర్గా భవానీ జలుమూరు మండలం అచ్యుతాపురం జెడ్‌పి హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కోటబొమ్మాళికి చెందిన సకలాబత్తుల సాయి బదరీష్‌కు 128వ ర్యాంకు దక్కింది. తండ్రి గుప్త వ్యాపారం చేస్తున్నారు. తల్లి శ్రీలక్ష్మి గృహిణి.నరసన్నపేట మండలానికి చెందిన గొండు సాయిప్రణీత్‌ 411 ర్యాంకు సాదించాడు. సాయిప్రణీత్‌ ఆరు నుంచి పదో తరగతి వరకు నారాయణ స్కూల్‌లో చదివాడు. ఇంటర్మీడియట్‌ విశాఖపట్నం నారాయణ కళాశాలలో అభ్యసించాడు. తల్లిదండ్రులు ఇరువురూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. పోలాకి మండలం పోలాకి గ్రామానికి చెందిన పాలబోయిన ప్రణరు 743వ ర్యాంకు సాధించాడు. ప్రణరు ఇంటర్మీడియట్‌ విశాఖపట్నంలోని నారాయణ కళాశాలలో చదివాడు. వీరికి నారాయణ కళాశాల డిజిఎం హనుమంతురావు, ఎజిఎం ఐ.రమేష్‌, ప్రిన్సిపాల్‌ ఎ.రమేష్‌ అభినందనలు తెలిపారు.అగ్రికల్చర్‌ విభాగంలో సత్తా చాటిన విద్యార్థులుటెక్కలి పట్టణానికి చెందిన మల్లిపెద్ది ప్రణవ్‌సాయి అగ్రికల్చర్‌ విభాగంలో 12వ ర్యాంకు సాధించాడు. ప్రణవ్‌సాయి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్థానికంగా ఉన్న పాఠశాలల్లో, ఆరు నుంచి పదో తరగతి వరకు వెన్నెలవలసలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో చదివారు. ఇంటర్మీడియట్‌ రాజమండ్రిలోని శశి కళాశాలలో చదివారు. ఇటీవల తెలంగాణ ఎంసెట్‌లో ప్రణవ్‌సాయి 62 ర్యాంకు సాధించగా, నీట్‌ ఫలితాల్లో 430వ ర్యాంకు సాధించాడు. ప్రణవ్‌సాయి తండ్రి మధుసూదనరావు వ్యాపారవేత్త కాగా, తల్లి సంతోషి జ్యోతిబాపూలే పాఠశాలలో ఒప్పంద ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రణవ్‌సాయిని కుటుంబసభ్యులతో పాటు పలువురు అభినందించారు.పాతపట్నం మండలం తీమరకు చెందిన బి.గౌతమికి 24వ ర్యాంకు దక్కింది. శ్రీకాకుళం నగరం బలగకు చెందిన జరుగుళ్ల నాగ కార్తీక్‌ 40వ ర్యాంకు సాధించాడు. కోటబొమ్మాళికి చెందిన గొల్లపల్లి రిజియాకు 55వ ర్యాంకు దక్కింది. శ్రీకాకుళం నగరం ప్రశాంత్‌నగర్‌ కాలనీకి చెందిన కింజరాపు సంజోగ్‌ నాయుడుకు 80వ ర్యాంకు వచ్చింది. నరసన్నపేట మండలం సత్యవరానికి చెందిన తండారపు సుభాష్య 85వ ర్యాంకు దక్కింది. బూర్జ మండలం తోటాడకు చెందిన తోట సుచితకు 86వ ర్యాంకు, పొందూరు మండలం అచ్చిపోలవలసకు చెందిన గురుగుబెల్లి జై కిశోర్‌కు 89వ ర్యాంకు వచ్చింది.సత్తాచాటిన ‘కాకినాడ ఆదిత్య’ విద్యార్థులుఇఎపిసెట్‌ ఫలితాల్లో కాకినాడ ఆదిత్య విద్యార్థులు సత్తా చాట్టారు. భమిడిపాటి స్వర్ణశ్రీ 110.2012 మార్కులు సాధించి 459 ర్యాంకు దక్కించుకుంది. మాతా ప్రవళ్లిక 95.1873 మార్కులతో 1347వ ర్యాంకు వచ్చింది. పెద్దిన శరణ్య 93.6263 మార్కులు సాధించి 1457వ ర్యాంకు దక్కించుకుంది. ఈ ముగ్గురు ఇటీవల విడుదలైన జెఇఇ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లోనూ మెరుగైన ర్యాంకులు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్‌ చక్రవర్తి, ప్రిన్సిపాల్‌ ఎం.ఢిల్లేశ్వరరావు అభినందించారు.’నారాయణ’ విద్యార్థుల ప్రతిభవిశాఖపట్నం నారాయణ విద్యాసంస్థలో చదువుతున్న పలాసకు చెందిన పొట్నూరు హతిన్‌ సాయి, తమ్మినేని అమృత, కొమురు సుధాన్వి ఇఎపిసెట్‌ ఫలితాల్లో సత్తా చాటారు. హతిన్‌ సాయి 238వ ర్యాంకు, తమ్మినేని అమృత 284వ ర్యాంకు, కొమురు సుధాన్వి 732వ ర్యాంకు సాధించారు.

➡️