జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో మెరిసిన విద్యార్థులు

శంలోని ప్రతిష్టాత్మక

అమృత

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, పలాస, వజ్రపుకొత్తూరు

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటిల్లో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. జాతీయ స్థాయిలో జెఇఇ అడ్వాన్స్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గార మండలం కొర్ని గ్రామానికి చెందిన చమళ్ల భానుప్రకాష్‌ జాతీయ స్థాయిలో 1246వ ర్యాంకు సాధించాడు. అతని తండ్రి వెంకటేశ్వరరావు పోలాకి మండలం కొల్లివలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. తల్లి లత గృహిణి. నరసన్నపేటలో పదోతరగతి వరకు చదువుకున్న భానుప్రకాష్‌ ఇంటర్మీడియట్‌ విశాఖలో పూర్తి చేశాడు. మెయిన్స్‌లో చోటు దక్కించుకున్న అతనికి అడ్వాన్స్‌లోనూ జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు దక్కింది.నరసన్నపేటకు చెందిన కోరాడ సౌదీప్‌ 225 మార్కులతో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీ 1265 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. జెఇఇ మెయిన్స్‌లో ఓపెన్‌ కేటగిరీ 1450 ర్యాంకు సాధించాడు. సౌదీప్‌ గుంటూరు భాష్యంలో పది, ఇంటర్మీడియట్‌ చదివాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. తండ్రి కోరాడ వైకుంఠరావు నరసన్నపేట మండలం కంబకాయ జెడ్‌పి హైస్కూల్‌లో పనిచేస్తున్నారు. యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. తల్లి దుర్గా భవానీ జలుమూరు మండలం అచ్యుతాపురం జెడ్‌పి హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేయాలన్నదే తన లక్ష్యమని సౌదీప్‌ తెలిపాడు. సౌదీప్‌ ర్యాంకు సాధించడంపై యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, జెబిపి రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ అభినందనలు తెలిపారు.పొందూరు మండలం గోరింటకు చెందిన బాడాన హితేష్‌ జాతీయ స్థాయిలో 191 మార్కులతో 3092వ ర్యాంకు సాధించాడు. ఒబిసి కేటగిరీలో 542 ర్యాంకులో నిలిచాడు. తండ్రి గోవిందరాజులు ఐతమ్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, తల్లి వనజాక్షి గృహిణి. ఐఐటిలో ఇసిఇ చదవాలన్నదే లక్ష్యమని హితేష్‌ చెప్పాడు.ఆమదాలవలస మండలం గేదెలవానిపేటకు చెందిన పసగాడ పవన్‌సాయి 177 మార్కులతో ఓపెన్‌ కేటగిరీలో 4442వ ర్యాంకు, ఒబిసి కేటగిరీలో 837వ ర్యాంకు సాధించాడు. తండ్రి అప్పలరాజు టైలర్‌గా పనిచేస్తుండగా, తల్లి శారద మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలిగా పనిచేస్తోంది.శ్రీకాకుళం నగరంలోని బాకర్‌సాహెబ్‌పేటకు చెందిన లొద్ది గిరిజాశంకర్‌ జాతీయ స్థాయిలో 6928వ ర్యాంకు సాధించాడు. ఒబిసి కేటగిరీలో 1436 వర్యాంకు దక్కింది. తండ్రి నీలయ్య మెడికల్‌ ల్యాబ్‌ అసిస్టెంటుగా పనిచేస్తుండగా, తల్లి చంద్రకళ గృహిణి. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురానికి చెందిన బత్తిన అవినాష్‌ జాతీయ స్థాయిలో 17262, ఒబిసి కేటగిరీలో 4229వ ర్యాంకు సాధించాడు.సత్తా చాటిన ‘కాకినాడ ఆదిత్య’ విద్యార్థులు జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో కాకినాడ ఆదిత్య విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ స్థానాలు దక్కించుకున్నారు. కళాశాలలో చదువుతున్న భమిడిపాటి స్వర్ణశ్రీ 1941, మాతా ప్రవళ్లిక 2795, జరజాన రాజగిరీష్‌ 2634, జరజాన రాజ్‌ గౌతం 1240, చింతాడ దివ్య తేజశ్రీ 3700 ర్యాంకు సాధించారు. శ్రీకాకుళం కేంద్రంగా సీతంపేట ఐటిడిఎ ఆధ్వర్యాన వైటిసిలో నిర్వహిస్తున్న ఐఐటి సూపర్‌-60 బ్యాచ్‌ విద్యార్థులు సత్తా చాటారు. టి.సాగర్‌కు ఎస్‌సి కేటగిరీలో 2824 ర్యాంకు సాధించి ఐఐటి సీటు దక్కించుకోగలిగాడు. అతనితో పాటు మరో ఏడుగురు విద్యార్థులు ప్రిపరేటరీ ర్యాంకులను సాధించారు. ర్యాంకులు సాధించిన వారిలో డి.పవిత్ర, బి.భావన, ఎస్‌.నాని, ఎస్‌.మాళవిక, కె.గుణశ్యామ్‌, కె.సోమేష్‌ ఉన్నారు.చక్రధర్‌ విద్యాసంస్థల ప్రతిభఅడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో చక్రధర్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ర్యాంకులు దక్కించుకున్నారు. కె.మోహన దివ్య 2910, బి.జ్ఞానహర్ష 300 (ఎస్‌టి కోటా), పి.కృష్ణ 2602 ర్యాంకులను సాధించారు. వారిని చక్రధర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ యాళ్ల చక్రధరరావు అభినందించారు. నారాయణ విద్యార్థుల ప్రతిభవిశాఖపట్నం నారాయణ విద్యాసంస్థలో చదువుతున్న పలాసకు చెందిన తమ్మినేని అమృత, జి.గుణశేఖర్‌, కె.సుధాన్వి, పి.హతిన్‌సాయి సత్తా చాటారు. తమ్మినేని అమృత ఒబిసిలో 865 ర్యాంకు సాధించగా, జాతీయ స్థాయిలో కేటగిరీలో 4557, జి.గుణశేఖర్‌ ఒబిసి కేటగిరీలో 541, జాతీయ స్థాయిలో కేటగిరీలో 4828, కె.సుధాన్వి జాతీయ స్థాయిలో 6455, పొట్నూరు హతిన్‌ సాయి జాతీయ స్థాయిలో 9454 ర్యాంకులు సాధించారు.

➡️