కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాశక్తి – పాతపట్నం
పాతపట్నంలోని బాలయోగి గురుకుల పాఠశాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది నిర్వహణ సరిగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఆర్‌ఒ ప్లాంట్ నీరు సరిగా రావడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పాతపట్నం సామాజిక ఆస్పత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని వైద్యులకు సూచించారు. అంబులెన్స్ సేవలను మెరుగుపరచాలన్నారు. గిరిజన గ్రామాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించే ఆస్పత్రిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ వై.ఎస్.ఎస్ ప్రసాద్, రెవెన్యూ, విద్య, వైద్యశాఖల అధికారులు పాల్గొన్నారు.విద్యార్థులతో మాట్లాడుతున్న