అభివృద్ధికి మూఢ విశ్వాసాలు ఆటంకం

ఆధునిక ప్రపంచంలో

మాట్లాడుతున్న శ్రీనివాస్‌

  • జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాస్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఆధునిక ప్రపంచంలో శాస్త్ర, విజ్ఞానరంగాలు అభివృద్ధి చెందుతున్నా నేటికీ మూఢ విశ్వాసాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాస్‌ అన్నారు. మూఢ నమ్మకాలను వీడి శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకో వాలన్నారు. నగరంలోని పెద్ద రెల్లివీధి మున్సిపల్‌ స్కూల్‌లో రెండో రోజు శనివారం వేసవి వినోద కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రీయ దృక్పథంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా విద్యనభ్య సించాలని సూచించారు. మూఢ నమ్మకాలు అభివృద్ధికి ఆటంకమన్నారు. శాస్త్రీయ విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతిఒక్కరూ తమ జీవిత లక్ష్యాలను సాధించేందుకు విద్య ముఖ్య సాధనమని, అందువల్ల ప్రతిఒక్కరూ చదువులో పోటీతత్వాన్ని అలవరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక విద్యా విభాగం రాష్ట్ర కన్వీనర్‌ గొంటి గిరిధర్‌, కోశాధికారి వి.ఎస్‌ కుమార్‌, పెన్షనర్ల సంఘం జిల్లా నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️