పుష్పగుచ్ఛం అందజేస్తున్న సిబ్బంది
ప్రజాశక్తి – శ్రీకాకుళం
జిల్లా నూతన డివిఇఒగా రేగ సురేష్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. విజయనగరం జిల్లా గుర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై డివిఇఒగా ఇక్కడకు వచ్చారు. ఇప్పటివరకు డివిఇఒగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.తవిటినాయుడు విజయనగరం జిల్లా రెగ్యులర్ డివిఇఒగా ఉద్యోగోన్నతిపై వెళ్లారు. సురేష్‌కుమార్ 1992లో సర్వీస్ కమిషన్ ద్వారా కామర్స్ జూనియర్ లెక్చరర్‌గా వృత్తి జీవితం ప్రారంభించారు. విజయనగరం జిల్లా చినమేరంగి, గుమ్మలక్ష్మీపురం, గజపతినగరం మండలాల్లో పనిచేశారు. ఉద్యోగోన్నతిపై ప్రిన్సిపాల్‌గా ఎస్.కోట, గుమ్మలకీëపురం, గుర్ల కళాశాలల్లో పనిచేశారు. విజయనగరం జిల్లా డివిఇఒగా ఎఫ్‌ఎసి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రత్యేక గుర్తింపు పొందారు. నూతన డివిఇఒగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఆర్‌ఐఒ దుర్గారావు, ప్రిన్సిపాల్స్ భీమేశ్వరరావు, వర్మ, నాగేంద్రశర్మ, గణపతి వెంకటేశ్వరరావు, కీర్తి తవిటినాయుడు, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రతినిధులు కరణం నర్సింగరావు, ఎన్.వి.సత్యనారాయణ తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.