బూర్జలో తమ్మినేని ప్రచారం

Apr 3,2024 12:57 #srikakulam

ప్రజాశక్తి-బూర్జ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి ఆముదాలవలస వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాంకు ప్రజలు నీరాజనం పట్టారు. అసెంబ్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా బుధవారం నాడు మండలంలోని అల్లిన గ్రామంలో తమ్మినేని సీతారాం ఇంటింటా ప్రచారం సాగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందజేశారని అన్నారు. ముఖ్యంగా ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం సమ పాలల్లో అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరుగాంచారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే జగన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేశానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తనను ఎమ్మెల్యేగా గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు తమ్మినేని సీతారాంకు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు స్థానిక సర్పంచ్ జడ్డు దివ్య మహేష్, గడ్డు రామానంద్, రాష్ట్ర టిట్కో డైరెక్టర్ ఏ గోవిందరావు, జడ్పిటిసి బి రామారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ గుమ్మడి రాంబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షులు సురేష్ దొర, పిఎసిఎస్ డైరెక్టర్ గోవిందరావు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

➡️