ప్రజాశక్తి-ఎచ్చెర్ల : ఎచ్చెర్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఆదివారం ఉదయం సంభవించింది. రణస్థలం CHC లో టెక్నిషియన్ గా విధులు నిర్వహిస్తున్న దేశరాజ వెంకట కిరణ్ కుమార్ (40) ఎచ్చెర్లలోని కేశవరెడ్డి స్కూల్ వద్ద జంక్షన్ దాటుతుండగా రాజాం నుంచి వస్తున్న మ్యాక్సీ క్యాబ్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఎచ్చెర్ల ఎస్సై సందీప్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
