విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేస్తున్న విసి రజని
ప్రజాశక్తి- ఎచ్చెర్ల
బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిశోధనాభివృద్ధి కేంద్రం, రోసిస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇన్నోవేటివ్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీస్ (ఐసిడిట్)తో కలిసి వర్శిటీలో నిర్వహించిన అయిదు రోజుల ప్రత్యేక శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. శిక్షణలో భాగంగా మూడురోజుల పాటు తరగతులు, రెండు రోజులు ల్యాబ్‌వర్క్ నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ఆర్.రజని పాల్గొని మాట్లాడుతూ ఈ తరహా శిక్షణలు పూర్తిచేసిన వారు టెలికాం, భవన నిర్మాణాలు, రక్షణ, వ్యవసాయం తదితర రంగాల్లో డ్రోన్ ఫైలెట్‌గా పనిచేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. శిక్షణలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానం, కెరీర్‌ను మరింతగా మెరుగు పర్చుకునేందుకు వినియోగించు కోవాలని సూచించారు. శిక్షణ పూర్తిచేసిన 87 మంది విద్యార్థుల్లో ప్రతిభ కనపర్చిన ఐదుగురు విద్యార్థులకు ప్రశాంసా పత్రాలను ఆమె అంద జేశారు. ఐసిడిటికు చెందిన ఆపరేషనల్ హెడ్ పి.సాయనాథ్ మనోహర్, ఆర్‌అండ్‌డి హెడ్ పి.సాయిలత, మెకానికల్ ఇంజినీర్ వి.శివకుమార్, ఆర్‌అండ్‌డి ఇంజినీర్లు కె.జ్యోతి, వి.పావనిలు ఈ శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో వర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. సిహెచ్. రాజశేఖరరావు, ఆర్‌అండ్‌డి డీన్ డా.ఎన్. లోకేశ్వరి, అకడమిక్ అఫైర్స్ డీన్ డా.కె. స్వప్న వాహిణి, సహాయ డీన్ డా. ఎన్. మధులత తదితరులు పాల్గొన్నారు.