సమాజ హితమే ‘స్వీప్‌’ లక్ష్యం

సమాజ హితమే స్వీప్‌

మొక్కను నాటుతున్న జగన్నాథం నాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం రూరల్‌

సమాజ హితమే స్వీప్‌ స్వచ్ఛంద సంస్థ లక్ష్యమని ఆ సంస్థ వ్యవస్థాపకులు కొమ్ము రమణమూర్తి అన్నారు. స్వీప్‌ సంస్థ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని తండ్యాంవలసలో మొక్కలు నాటడం, ప్రకృతి వ్యవసాయంపై సోమవారం అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేయడంలో, బాలల హక్కులపై ఉత్తరాంధ్రలో రైట్‌ టు ఎడ్యుకేషన్‌ ఫర్‌ కన్వీనర్‌గా దేశ, రాష్ట్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారుల హక్కులు, విపత్తుల నుంచి ఎదుర్కోవడంపై అవగాహనను కలిగించినట్లు చెప్పారు. మైదాన ప్రాంతంలో మహిళా సంఘాలు, రైతులు, నాన్‌ పోస్ట్‌ సైడ్‌ మేనేజ్‌మెంట్‌తో మొదలుపెట్టి ప్రకృతి వ్యవసాయం వరకు చిరుధాన్యాల పంటలను ప్రోత్సహిస్తూ ఫార్మర్‌ ప్రొడక్ట్‌ కంపెనీలు నడపడంలో మెళకువలు నేర్పామని వివరించారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హర్షవల్లి అధ్యక్షులు వావిలాపల్లి జగన్నాథనాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై స్వీప్‌ స్వచ్చంద సంస్థ సాగించిన కృషి అభినందనీయమన్నారు. మూడేళ్ల పాటు జిల్లాలో సేంద్రీయ సేద్య తొలి జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌గా డిఆర్‌డిఎ ద్వారా సేవలందించిన జగన్నాథ నాయుడును సత్కరించారు. కార్యక్రమంలో సేంద్రీయ సేద్య ప్రచారకులు డి.అన్నపూర్ణ, సంస్థ కో- ఆర్డినేటర్‌ అప్పన్న, ప్రజలు పాల్గొన్నారు.

➡️