ప్రచారం చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోరెడ్ల విజయగౌరికి తొలి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని ఉద్యోగ సంఘ నాయకులు కె.శ్రీనివాసు, ఎం.ప్రభాకరరావు కోరారు. నగరంలోని సన్ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడారు. కళాశాల అధ్యాపకులను కలిసి తొలి ప్రాధాన్యతా ఓటు వేయాలని కోరారు. ఆమె ఉద్యమ అనుభవాలను వివరించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన కలిగి నిజాయితీ గల అభ్యర్థి విజయగౌరి అని అన్నారు. ప్రభుత్వంతో ఉపాధ్యాయ, ఉద్యోగ, అధ్యాపకుల సమస్యలపై పోరాడ గల వ్యక్తి అని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో ఆ విధానాలను సరిచేసే పోరాటాలను ముమ్మరం చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను వేదికగా ఎంచుకుని ఆమెను గెలిపించాలని కోరారు.