పేదల సంక్షేమమే లక్ష్యం

పేదల సంక్షేమమే

పింఛను అందజేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – సంతబొమ్మాళి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని నరసాపురంలో మంగళ వారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ అందజేస్తామని తెలిపారు. జగన్‌ తన పాలనలో రూ.12 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని ధ్వజమెత్తారు. తన పాలనలో బటన్‌ నొక్కి ప్రజలకు రూ.మూడు లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్తున్న జగన్‌, మిగతా రూ.తొమ్మిది లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. గత ఐదేళ్ళుగా పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయిందని విమర్శించారు. కనీసం రోడ్లు, కాలువలు, డ్రైనేజీల మరమ్మతులకు నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి పంచాయతీని అభివృద్ధిపథంలో నిలబెడతామన్నారు. టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు రూ.వంద కోట్ల వ్యయంతో ఇంటింటికీ తాగునీటి కుళాయి వేసి 24 గంటలూ మంచినీటి సరఫరా చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఎంపిడిఒ ప్రేమలీల, ఎంపిటిసి ఎం.పద్మ, తోటాడ సర్పంచ్‌ యర్నాగుల సునీత, టిడిపి నాయకులు ఎం.రామచంద్రరావు, ఆళ్ల బైరాగి తదితరులు పాల్గొన్నారు.

➡️