సమావేశంలో మాట్లాడుతున్న పీడీ సుధాకరరావు
డ్వామా పీడీ సుధాకరరావు
ప్రజాశక్తి – పొందూరు
ఉపాధి కూలీలకు గరిష్ట కూలి అందేలా చూడాల్సిన బాధ్యత ఉపాధి హామీ సిబ్బందిదేనని డ్వామా పీడీ పి.సుధాకరరావు ఆన్నారు. మండలంలో ఉపాధి పనులకు కూలీలు తక్కువగా హాజరు కావడంపై ఉపాధి హామీ సిబ్బందితో శుక్రవారం ఉపాధి హామీ కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది జిల్లాతో పాటు మండలంలోనూ గరిష్ట కూలి రూ.249 కూలీలకు అందేదని, ప్రస్తుతం మండలంలో రూ.289 కూలిగా అందుకుంటున్నారని తెలిపారు. గరిష్ట కూలి రూ.307 అందేలా కూలీలతో పనులు చేయించాలన్నారు. వేసవి అలవెన్సులు లేవని, పనుల వద్ద సౌకర్యాలు ఉపాధి కూలీలే కల్పించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పీడీ పలు రికార్డులను పరిశీలించారు. సమావేశంలో ఎంపిడిఒ మన్మథరావు, ఎపిఒ శ్రీనివాసరావు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇసిలు, సిబ్బంది పాల్గొన్నారు.