మున్సిపాల్టీ ఆదాయ వనరులు పెంచుకోవాలి

ప్రభుత్వ నిధులపైనే

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ప్రజాశక్తి – ఇచ్ఛాపురం

ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా మున్సిపాల్టీలో ఆదాయ వనరులు పెంచుకొని అభివృద్ధిపథంలో నడిపించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అదికారులకు సూచించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి మున్సిపల్‌ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలోని 23 వార్డుల్లో పూర్తిస్థాయిలో ప్రజలకు తాగునీరు అందించాలన్నారు. ఇంటి పన్నులు, ఖాళీ స్థలాలు, టౌన్‌ ప్లానింగ్‌ ద్వారా ఆదాయాలను పెంచుకోవాలని సూచించారు. రెవెన్యూ పెంచుకుంటేనే మున్సిపాల్టీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయగలమని చెప్పారు. రెవెన్యూ బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం వహించకుండా శత శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. రోడ్డుపై తిరుగుతున్న పశువుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని, సిబ్బందికి ఏయే బాధ్యతలు అప్పగిస్తున్నదీ రికార్డులు నిర్వహించాలని తెలిపారు. దీపం-2 పథకం ద్వారా అర్హులకు పూర్తిస్థాయిలో సిలిండర్లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ పాల్గొన్నారు. రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీరబీ సీజన్‌లో ఆరుతడి పంటల కోసం రైతులకు రాయితీపై విత్తనాలను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ రైతులకు పంపిణీ చేశారు. వేరుశనగ, మినుము విత్తనాలు రాయితీపై ప్రభుత్వం అందిస్తున్నందున్న వ్యవసాయ శాఖ సూచనలను పాటించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. రైతులు ఉత్సాహంగా సాగు చేసి మరింత విస్తీర్ణం పెంచాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కె.జగన్మోహనరావు, మండల వ్యవసాయ అధికారులు బి.నరసింహమూర్తి, దుర్గాప్రసాద్‌, వ్యవసాయ సహాయకులు మల్లేష్‌, ప్రవీణ్‌, వెంకటేష్‌, పలువురు రైతులు పాల్గొన్నారు.

➡️