మాట్లాడుతున్న సత్యనారాయణ
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
నూతనంగా ఏర్పడిన శ్రీకాకుళం జిల్లా వాల్టప్ ఎపి ఇంజినీర్ల సంఘం సర్వసభ్య సమావేశం నగరంలోని 80 అడుగుల రోడ్డులో వి1 ఫంక్షన్ హాల్‌లో జరిగింది. గురువారం జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఇంజినీర్ల సంఘం అధ్యక్షునిగా బూర్ల సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీర్ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సమిష్టి కృషితో ఇంజనీర్ల సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాకి సురేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ఇంజినీర్లకు ఎదురవుతున్న అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునేందుకు సభ్యుల సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ సమావేశంలో చైర్మన్‌గా హారికా ప్రసాద్, ముఖ్య సలహాదారుగా కె.వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. సంఘం అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో వాండ్రంగి శ్రీనివాసరావు, వెంకుమహంతి శ్రీనివాస్, జి.శ్రీనివాసరావు, కె.హరీష్, బి.శ్రీనివాసరావు, డి.కామేశ్వరరావు, డిఎస్‌ఎన్‌ఎల్ మూర్తి, రవి, రాంజీ, శశికాంత్, ఈశ్వర్, రామకృష్ణ, సందీప్ రెడ్డి, కిరణ్ కుమార్, రామానాయుడు, రాహుల్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.