2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ వర్తింపజేయాలి

2003 డిఎస్‌పి నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన

మాట్లాడుతున్న శ్రీహరి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

2003 డిఎస్‌పి నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేయాలని 2003 డిఎస్‌సి ఫోరం జిల్లా కన్వీనర్‌ పి.శ్రీహరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నగరంలోని ఎన్‌జిఒ హోమ్‌లో డిఎస్‌సి ఫోరం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2003లో డిఎస్‌పి నోటిఫికేషన్‌ విడుదలైందన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రెండేళ్ల అనంతరం ఉద్యోగాలిచ్చి పాత పెన్షన్‌ వర్తించకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్‌ వర్తింప జేసేందుకు మెమో నంబరు 57 జారీ చేసినా పాత పెన్షన్‌ను కాదని సిపిఎస్‌లోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచన చేసి పాత పెన్షన్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఫోరం కో-కన్వీనర్లుగా పి.శ్రీకర్‌, కె.ప్రకాష్‌, బి.శ్రీనివాస రావు, ఎ.లక్ష్మణరావులను సభ్యులు ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్‌.ఫాల్గుణరావు, ఎం.బుచ్చిబాబు, జి.భాస్కరరావు, ఆపస్‌ జిల్లా అధ్యక్షులు డి.శివరాంప్రసాద్‌, జి.చిన్నికృష్ణంనాయుడు పాల్గొన్నారు.

➡️