పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

దోమలు పెరగకుండా పరిసరాలు పరిశుభ్రం గా ఉంచుకోవాలని

అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారి రవికుమార్‌

ప్రజాశక్తి- పోలాకి

దోమలు పెరగకుండా పరిసరాలు పరిశుభ్రం గా ఉంచుకోవాలని పోలాకి పిహెచ్‌సి వైద్యాధికారి నల్లి రవికుమార్‌ అన్నారు. మలేరియా వ్యాధి వ్యతిరేక మారోత్సవాలు సందర్భంగా మండలంలోని వెదుర్లవలస ఉపాధి కూలీలకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మలేరియా వ్యాధి ప్లాస్మోడియం అనే పరాన్నజీవి మానవునికి ఆడ ఎనఫిలిస్‌ దోమ కరవడం ద్వారా వ్యాప్తి చెందుతుందని వివరించారు. ఈ వ్యాధి సోకిన వెంటనే సకాలంలో చికిత్స తీసుకోవాలని, లేకుంటే కిడ్నీ, హృదయం, మెదడు తదితర అవయవలకు సంక్రమించి ప్రాణాపాయం సంభవించునని తెలిపారు. మురుగు మురికి నీటి కుంటలపై వేస్ట్‌ ఇంజిన్‌ ఆయిల్‌ జల్లి దోమ లార్వాలకు శ్వాస అడకుండా చేయవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ఈశ్వరమ్మ, శేఖర్‌బాబు, లక్ష్మి, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

 

➡️